తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ
- సర్వదర్శనం కోసం 29 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
- శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
- నిన్న స్వామివారిని దర్శించుకున్న 75 వేల మంది భక్తులు
- నిన్న ఒక్కరోజే హుండీ ద్వారా రూ.4 కోట్ల ఆదాయం
కాగా, నిన్న తిరుమల శ్రీవారిని 75,175 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,979 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.4.05 కోట్ల ఆదాయం లభించింది.