జాతీయ సినిమా దినోత్సవాన్ని సెప్టెంబరు 23కి వాయిదా వేసిన మల్టీప్లెక్స్ అసోసియేషన్

MAI postpones National Cinema Day
  • కరోనా సంక్షోభం అనంతరం తిరిగి తెరుచుకున్న సినిమా హాళ్లు
  • జాతీయ సినిమా దినోత్సవం నిర్వహించాలని ఎంఏఐ నిర్ణయం
  • తొలుత ఈ నెల 16న వేడుకలు నిర్వహించాలని నిర్ణయం
భారత్ లో ఈ నెల 16న నిర్వహించ తలపెట్టిన జాతీయ సినిమా దినోత్సవం వాయిదా పడింది. దీనిని సెప్టెంబరు 23కి వాయిదా వేసినట్టు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) వెల్లడించింది. జాతీయ సినిమా దినోత్సవం నాడు దేశంలోని 4 వేలకు పైగా మల్టీప్లెక్స్ లలో రూ.75కే ప్రత్యేక ప్రవేశ టికెట్ అందజేయాలని ఎంఏఐ నిర్ణయించింది. 

పీవీఆర్, ఐనాక్స్, సినీపొలిస్, కార్నివాల్, డిలైట్ తదితర మల్టీప్లెక్స్ యాజమాన్యాలు సినిమా దినోత్సవంలో పాలుపంచుకుంటున్నాయి. అయితే ఈ వేడుకల్లో మరిన్ని మల్టీప్లెక్స్ లను కలుపుకుని పోయేందుకు గాను జాతీయ సినిమా దినోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్టు ఎంఏఐ తెలిపింది. జాతీయ సినిమా దినోత్సవం నాడు మల్టీప్లెక్స్ లకు, థియేటర్లకు భారీగా తరలిరావాలని ఎంఏఐ ప్రేక్షకులను ఆహ్వానించింది. 

కరోనా సంక్షోభం అనంతరం మల్టీప్లెక్స్ లను, థియేటర్లను మళ్లీ తెరిచిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ జాతీయ సినిమా దినోత్సవం నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. సినిమా మళ్లీ తమకు చేరువలోకి వచ్చిందన్న విషయాన్ని ప్రేక్షకులు గుర్తించి, సినిమా దినోత్సవాలలో పాలుపంచుకోవాలని కోరింది.
Go Back to Shorts
National Cinema Day
Multiplex Association Of India
MAI
India

More Telugu News