YSRCP: తెలుగు సినిమా 'తగ్గేదే లే' అని నిరూపించారు: వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

  • సైమా అవార్డుల్లో 6 అవార్డుల‌ను గెలుచుకున్న పుష్ప‌
  • పుష్ప అవార్డుల‌పై సోష‌ల్ మీడియాలో సాయిరెడ్డి పోస్టులు
  • అల్లు అర్జున్ న‌ట‌న‌, సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం అద్భుత‌మ‌ని ప్ర‌శంస‌
vijay sai reddy lauds tollywoodfilm pushpa

నిత్యం రాజ‌కీయాల‌పై, వైరి వ‌ర్గాల‌పై విమ‌ర్శ‌లు, సెటైర్లు సంధించే వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి సోమ‌వారం త‌న సోష‌ల్ మీడియా వేదిక‌ల మీద రాజ‌కీయేత‌ర అంశాన్ని ప్ర‌స్తావిస్తూ పోస్టులు పెట్టారు. తెలుగు సినిమా పుష్ప చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేసిన ఆయ‌న‌... ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా 'తగ్గేదే లే' అని నిరూపించారంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు.

ఆదివారం జ‌రిగిన సైమా అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో పుష్ప చిత్రం ఏకంగా 6 అవార్డుల‌ను గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన సాయిరెడ్డి.. పాన్ ఇండియా మూవీగా రికార్డ్స్ బ్రేక్ చేసి సైమా అవార్డుల్లో సత్తాచాటి ఏకంగా 6 అవార్డులు గెలుచుకున్న 'పుష్ప' చిత్రం యూనిట్ కు అభినందనలు అంటూ పేర్కొన్నారు. సినిమాలో అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వం అద్భుతమ‌ని ఆయ‌న ప్ర‌శంసించారు.

More Telugu News