తమ్ముడు పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

Chiranjeevi birthday greetings to Pawan Kalyan
  • నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు
  • పవన్ ఆశ, ఆశయం ఎప్పుడూ జనహితమేనన్న మెగాస్టార్
  • పవన్ ఆశయాలన్నీ నెరవేరాలని ట్వీట్
జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, జనసైనికులు, సినీ, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పవన్ తో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మరోవైపు తమ్ముడు పవన్ జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఆశ, ఆశయం ఎల్లప్పుడూ జనహితమేనని చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయతీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కల్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కల్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Chiranjeevi
Tollywood
Pawan Kalyan
Janasena
Birthday

More Telugu News