"మనల్ని ఎవడ్రా ఆపేది"... పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేపథ్యంలో అభిమానులు రూపొందించిన పాట ఇదిగో!
Add ap7am to your home Screen

"మనల్ని ఎవడ్రా ఆపేది"... పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేపథ్యంలో అభిమానులు రూపొందించిన పాట ఇదిగో!

Fans made special on Pawan Kalyan birthday
  • సెప్టెంబరు 2న పవన్ పుట్టినరోజు
  • ముందే సంబరాలు మొదలుపెట్టిన అభిమానులు
  • నేడు ప్రత్యేక గీతం విడుదల
  • సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్న పాట
జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రేపు (సెప్టెంబరు 2) పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ క్రమంలో పవన్ అభిమానులు చాలా ముందుగానే సంబరాలు షురూ చేశారు. తమ ఆరాధ్య హీరో, నేత కోసం ఫ్యాన్స్ ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించడం విశేషం. 'మనల్ని ఎవడ్రా ఆపేది..' అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. పవన్ గతంలో స్టేజిపై పలికిన మనల్ని ఎవడ్రా ఆపేది అనే డైలాగును ఈ పాటలో ప్రముఖంగా ఉపయోగించారు. ఈ పాట నేడు యూట్యూబ్ లో విడుదల కాగా, పవన్ అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది.


Pawan Kalyan
Birthday
Special Song
Fans
Janasena
Tollywood

More Telugu News