దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

India corona updates
  • గత 24 గంటల్లో 5,439 కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,031
  • 65,732కి తగ్గిన యాక్టివ్ కేసులు
కరోనా మహమ్మారితో విలవిల్లాడిన భారత్ లో మళ్లీ సాధారణ స్థితి నెలకొంటోంది. కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 3,20,418 మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా కొత్తగా 5,439 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 22,031 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 65,732 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.70 శాతంగా, రికవరీ రేటు 98.66 శాతంగా, క్రియాశీల రేటు 0.15 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 88.55 కోట్ల కోవిడ్ టెస్టులను నిర్వహించడం గమనార్హం. మరోవైపు ఇప్పటి వరకు 212.17 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. వీరిలో 94.23 కోట్ల సెకండ్ డోసులు, 15.66 కోట్ల ప్రికాషన్ డోసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 26,36,224 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News