ఈ నెల 31న బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో సీఎం కేసీఆర్ భేటీ
- ఎన్డీయే వ్యతిరేక పక్షాలను కూడగడుతున్న కేసీఆర్
- జాతీయ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాలని నిర్ణయం
- తరచుగా రాష్ట్రాల పర్యటనలకు వెళుతున్న కేసీఆర్
కాగా, చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన భారత జవాన్ల కుటుంబ సభ్యులను కూడా సీఎం కేసీఆర్ తన బీహార్ పర్యటనలో కలవనున్నారు. అమర జవాన్లకు గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయాన్ని ఈ సందర్భంగా వారికి అందిస్తారు.
అంతేకాదు, సికింద్రాబాద్ టింబర్ డిపోలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగి 12 మంది బీహార్ వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించనున్న సీఎం కేసీఆర్... బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో కలిసి ఆర్థిక సాయం చెక్కులు అందిస్తారు.