Vijay Devarakonda: 'ఖుషి' సినిమాపై దృష్టి సారించనున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda to fucus on Khushi movie
షార్ట్స్‌లో చూడండి
'లైగర్' సినిమా పరాజయం పొందడంలో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ తో పాటు యూనిట్ సభ్యులందరినీ నిరాశకు గురి చేసింది. ఈ సినిమా హిట్ అయ్యుంటే పాన్ ఇండియా లెవెల్లో విజయ్ ఓ రేంజ్ కి వెళ్లిపోయేవాడు. కానీ, ఫలితం మరోలా వచ్చింది. అయితే, ఈ నిరాశ నుంచి బయట పడేందుకు విజయ్ యత్నిస్తున్నారు. తన తదుపరి చిత్రం 'ఖుషి'పై పూర్తిగా ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. 

ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాకు సంబంధించి దుబాయ్ లో జరిగే రెండు రోజుల ఈవెంట్ కు విజయ్ హాజరు కాబోతున్నాడు. ఆ తర్వాత 'ఖుషి' రెగ్యులర్ షూటింగ్ లో ఆయన పాల్గొనబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. 'లైగర్' డిజప్పాయింట్ చేసిన నేపథ్యంలో, విజయ్ కు ఇప్పుడు ఒక మంచి హిట్ సినిమా అవసరం. అందుకే అన్నింటిని పక్కన పెట్టి తన తదుపరి చిత్రంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాడు.
Go Back to Shorts
Vijay Devarakonda
Liger
Khushi
Samantha

More Telugu News