ట్విట్టర్ లో 5 మిలియన్ మార్క్ అందుకున్న పవన్ కల్యాణ్
- 2014లో ట్విట్టర్ ఖాతా తెరిచిన పవన్
- ఎనిమిదేళ్లలో 50 లక్షల మంది ఫాలోవర్లు
- అందరికీ కృతజ్ఞతలు తెలిపిన జనసేన
- సలహాలు, సూచనలకు ఆహ్వానం అని వెల్లడి
కాగా, ఆయన 5 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న నేపథ్యంలో, జనసేన పార్టీ స్పందించింది. పవన్ ను ట్విట్టర్ లో అనుసరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించింది. పొగడ్త అయినా, సద్విమర్శ అయినా శిరోధార్యమేనని, మెరుగైన సలహాలు, సూచనలకు ఎల్లవేళలా ఆహ్వానం పలుకుతామని పేర్కొంది. మీ అభిమానం అనిర్వచనీయం, ఆనందదాయకం అని ఓ ప్రకటన వెలువరించింది.