మా కరోనా వ్యాక్సిన్ ను కాపీ కొట్టారు... ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలపై దావా వేసిన మోడెర్నా
- ఎంఆర్ఎన్ఏ పద్ధతిలో మోడెర్నా వ్యాక్సిన్
- తమకు పేటెంట్లు ఉన్నాయన్న మోడెర్నా
- ఫైజర్, బయో ఎన్ టెక్ పేటెంట్ నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపణ
ఈ మేరకు మోడెర్నా... ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలపై దావా వేసింది. 2010, 2016 మధ్య కాలంలో ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీకి సంబంధించి దాఖలు చేసిన పేటెంట్ లను ఈ రెండు సంస్థలు ఉల్లంఘించాయని మోడెర్నా ఓ ప్రకటనలో వెల్లడించింది.
ప్రతి కణంలోనూ ప్రొటీన్ తయారీ వ్యవస్థలకు డీఎన్ఏ సంకేతాలను మోసుకెళ్లే జన్యు స్క్రిప్టునే ఎంఆర్ఎన్ఏ గా అభివర్ణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిలో ఈ టెక్నాలజీనే వినియోగిస్తున్నారు.