చింతామణి నాటకం నిషేధంపై రఘురామకృష్ణరాజు పిటిషన్.. నాటకం అసలు ప్రతిని అందించాలన్న హైకోర్టు
- తెలుగు వారిని దశాబ్దాల పాటు అలరించిన చింతామణి నాటకం
- నాటకాన్ని నిషేధించాలని ఎవరూ కోరలేదన్న రఘురామ తరపు న్యాయవాది
- ఒక సామాజికవర్గాన్ని తృప్తి పరిచేందుకే నిషేధించారని వాదన
చింతామణి నాటకాన్ని నిషేధించాలని రాష్ట్రంలో ఎవరూ కోరలేదని... ఒక సామాజికవర్గాన్ని కించపరిచే పదాలను మాత్రమే తొలగించాలని కోరారని కోర్టుకు తెలిపారు. అయితే ఆ సామాజికవర్గాన్ని సంతృప్తి పరిచేందుకే నాటకంపై ప్రభుత్వం నిషేధం విధించిందని చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం నాటకం అసలు ప్రతిని అందించాలని కోరింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.