బండి సంజయ్ వీడియోలను పెన్‌డ్రైవ్‌లో ఇచ్చిన ఏజీ... ఏం చేసుకోవాలన్న హైకోర్టు జడ్జీ
- బండి సంజయ్ పాదయాత్రపై హైకోర్టులో విచారణ
- విచారణకు హాజరైన వర్ధన్నపేట ఏసీపీ, ఏజీ
- పెన్ డ్రైవ్ లో ఆధారాలను ఏం చేసుకోవాలన్న న్యాయమూర్తి
- సాఫ్ట్ కాపీలో సమర్పిస్తామన్న ఏజీ
ఈ సందర్భంగా తన పాదయాత్రలో బండి సంజయ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారంటూ ఆరోపించిన ఏజీ... సంజయ్ ప్రసంగాలకు చెందిన వీడియోలను పెన్ డ్రైవ్‌లో కోర్టుకు అందజేశారు. ఏజీ అందజేసిన పెన్ డ్రైవ్‌ను తదేకంగా పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి...పెన్ డ్రైవ్‌తో ఏం చేసుకోవాలని ఏజీని ప్రశ్నించారు.
కోర్టుకు సమర్పించే ఆధారాలు ఏ రూపంలో ఉండాలో మీకు తెలియదా? అంటూ ఏజీని నిలదీసిన న్యాయమూర్తి... డాక్యుమెంట్ల సమర్ఫణలోనూ నిబంధనలు పాటించకుంటే ఎలాగని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియోలను సమర్పించాల్సి రావడంతోనే పెన్ డ్రైవ్‌లో ఇవ్వాల్సి వచ్చిందన్న ఏజీ... సాఫ్ట్ కాపీల్లో ఆ వీడియోలను అందజేస్తామని చెప్పడంతో న్యాయమూర్తి శాంతించారు.