Surya: సూర్య కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం!

  • శివ దర్శకత్వంలో సూర్య మూవీ 
  • కెరియర్ పరంగా సూర్యకి 42వ సినిమా 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ 
  • తెలుగు .. తమిళ భాషల్లో విడుదల
Surya in Shiva Movie

సూర్య హీరోగా ఆ మధ్య వచ్చిన 'ఆకాశం నీ హద్దురా' .. ' జై భీమ్' సినిమాలకి విశేషమైన ఆదరణ లభించింది. కానీ ఆ తరువాత వచ్చిన 'ఈటి' సినిమా తమిళంలో ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో అదే టైటిల్ తో విడుదలైన ఆ సినిమాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. 

ఆ తరువాత ఆయన అతిథి పాత్రలో కనిపించిన 'విక్రమ్' .. 'రాకెట్రి' సినిమాలు మాత్రం భారీ విజయాలను అందుకున్నాయి. ఇక తాజాగా సూర్య హీరోగా ఆయన 42వ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ రోజునే లాంఛనంగా మొదలైంది. యూవీ - స్టూడియో గ్రీన్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 

 అజిత్ కి వరుస హిట్లు ఇచ్చిన శివ, రజనీకాంత్ కి మాత్రం 'అన్నాత్తే' సినిమాతో ఫ్లాప్ ఇచ్చాడు. ఆ తరువాత సినిమాగా శివ ఈ ప్రాజెక్టు చేస్తున్నాడు. తెలుగు - తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇంకా టైటిల్ ను ఖరారు చేయని ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

More Telugu News