viral video: ఈ శునకానికి గిటార్ బాగా నచ్చేసినట్టుంది..!

  • బార్ లో గిటార్ వాయిస్తున్న వ్యక్తి
  • విని అక్కడకు వచ్చిన శునకం
  • ఆసక్తిగా వినడమే కాకుండా.. వాయించే ప్రయత్నం
Stray dog listens to live music at a bar You wonot believe what happened next in viral video

అది ఒక బార్. వీధి కుక్క ఒకటి అక్కడకు వచ్చింది. బార్ అంటే సంగీత కార్యక్రమం ఉంటుందని తెలుసు కదా. అదే సమయంలో బార్ లో ఓ వ్యక్తి గిటార్ వాయిస్తున్నాడు. అది ఆ కుక్కకు బాగా నచ్చేసింది. దీంతో గిటార్ వాయిస్తున్న వ్యక్తి వద్దకు వచ్చి నేలపై కూర్చుని శ్రద్ధగా వింది. 

అంతేకాదు.. రెండు కాళ్లపై లేచి నిలబడి చేతులతో గిటార్ వాయించే ప్రయత్నం చేయడం చూసే వారికి ఆనందాన్నిస్తుంది. ఆశ్చర్యం కలిగిస్తుంది. ట్విట్టర్ లోకి ఈ వీడియో చేరిపోవడంతో మంచి స్పందన వస్తోంది. ఇది ఎక్కడి బార్ లోని దృశ్యమో వెల్లడి కాలేదు కానీ, దీన్ని చూసిన వారు కూడా వినూత్నంగా స్పందిస్తున్నారు.

More Telugu News