అమెరికాలోని వెంకన్న ఆలయం వద్ద భార్యతో కలిసి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫొటో
- అమెరికా పర్యటనలో గోరంట్ల
- న్యూజెర్సీలోని వెంకన్న ఆలయాన్ని సందర్శించిన వైనం
- భార్యతో కలిసి ఆలయం వద్ద దిగిన ఫొటోను పంచుకున్న టీడీపీ ఎమ్మెల్యే
తాజాగా న్యూజెర్సీలో ఉన్న గోరంట్ల తన భార్యతో కలిసి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. ఆలయ గోపురం కనిపించేలా ఆలయానికి సమీపంలో ఉన్న ఓ బ్రిడ్జిపైకి చేరిన ఆయన తన అర్ధాంగితో కలిసి ఫొటో దిగారు. ఈ ఫొటోను ట్విట్టర్‌లో పంచుకున్న ఆయన... వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు వెల్లడించారు.