గాళ్ ఫ్రెండ్ బర్త్ డేని ఘనంగా సెలబ్రేట్ చేసిన సల్మాన్ ఖాన్!
- ఇప్పటికీ బ్రహ్మచారిగానే ఉన్న సల్మాన్ ఖాన్
- మోడల్ భామ లులియా వాంచూర్ తో సాన్నిహిత్యం
- 42వ పుట్టినరోజు జరుపుకున్న లులియా
- సల్మాన్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా హాజరైన వైనం
తాజాగా, లులియా వాంచూర్ 42వ పుట్టినరోజును సల్మాన్ ఖాన్ ఘనంగా నిర్వహించినట్టు తెలిసింది. ఈ నెల 24న లులియా బర్త్ డే కాగా, ఈ పుట్టినరోజు వేడుకల్లో సల్మాన్ ఖాన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పలువురు దర్శనమిచ్చారు. సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్, బావ ఆయుష్ శర్మ, దర్శకుడు సాజిద్ అలీ తదితరులు ఈ వేడుకల్లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను లులియా వాంచూర్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది.
.