జగన్ బాటలోనే వైసీపీ ఎమ్మెల్యే!... ఆటో డ్రైవర్గా మారిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే!
- విశాఖలో ఆటో డ్రైవర్ చొక్కాలో కనిపించిన సీఎం జగన్
- శ్రీకాళహస్తిలో ఆటో డ్రైవర్లతో ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి భారీ ర్యాలీ
- స్వయంగా ఆటో నడుపుతూ సాగిన వైసీపీ ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్ వాహనమిత్ర నిధుల విడుదల సందర్భంగా ఆటో డ్రైవర్లు, వారి ఆటోలతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆటో డ్రైవర్ చొక్కా వేసిన మధుసూదనరెడ్డి ఏకంగా డ్రైవర్ సీట్లో కూర్చుని ఆటో నడుపుతూ ర్యాలీకి నేతృత్వం వహించారు. ఈ ఫొటోలను ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.