Chiranjeevi: మెగా 154 మూవీ షూటింగులో జాయినైన రవితేజ

  • షూటింగు దశలో చిరంజీవి 154వ సినిమా 
  • పరిశీలనలో 'వాల్తేర్ వీరయ్య' టైటిల్ 
  • కథానాయికగా కనిపించనున్న శ్రుతి హాసన్ 
  • సంక్రాంతి బరిలో దిగనున్న సినిమా 
Bobby movie update

చిరంజీవి 153వ సినిమాగా 'గాడ్ ఫాదర్' రూపొందుతోంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సల్మాన్ ఖాన్ .. నయనతార కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇటీవల ఈ  సినిమా నుంచి వదిలిన చిరంజీవి పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఇక చిరంజీవి తన 154వ సినిమాను బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాకి 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఒక ముఖ్యమైన పాత్రలో రవితేజ నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆయన తప్పుకున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. 

మొత్తానికి ఆయన ఈ సినిమాలో చేస్తున్నట్టుగా .. షూటింగులో జాయిన్ అయిన్నట్టుగా మేకర్స్ ఈ రోజు ప్రకటించారు. వీరిద్దరి కాంబినేషన్ పట్ల ఆసక్తిని రేకెత్తిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. మెగాస్టార్ కారవాన్ లోకి రవితేజ ఎంటరైనట్టుగా ఒక వీడియోను రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, సంక్రాంతి బరిలోకి దింపుతున్నట్టుగా ప్రకటించారు.

More Telugu News