సూర్య 41వ సినిమాకి తెలుగు టైటిల్ ఖరారు!
- బాలా నుంచి మరో విభిన్న కథాచిత్రం
- సూర్య జోడీగా కనిపించనున్న కృతి శెట్టి
- తెలుగు టైటిల్ గా 'అచలుడు'
- దీపావళికి రిలీజ్ చేసే ఛాన్స్
బాలా .. వెట్రిమారన్ .. సుధ కొంగర సినిమాలు ఆ జాబితాలో ఉన్నాయి. ముందుగా బాలా సినిమాను పూర్తిచేసే పనిలో సూర్య ఉన్నాడు. ఈ సినిమాను కూడా తమిళంతో పాటు తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ రోజున బాలా పుట్టినరోజు కావడంతో ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేశారు.
తమిళంలో ఈ సినిమాకి 'వనంగాన్' అనే టైటిల్ ను నిర్ణయించగా.. తెలుగులో 'అచలుడు' అనే టైటిల్ ను సెట్ చేశారు. కొంతసేపటి క్రితమే టైటిల్ పోస్టర్స్ ను వదిలారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, సూర్య జోడీగా కృతి శెట్టి కనిపించనుంది. 'దీపావళి'కి ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.