మహోగ్ర గోదావరి... భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Huge rains causes Godavari flood
  • మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు
  • గోదావరికి భారీగా వరద నీరు
  • భద్రాచలం వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదావరి
  • 53 అడుగులకు చేరిన నీటిమట్టం
  • నాసిక్ లో పలు ఆలయాలు నీటమునక
ఎగువ పరీవాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. తెలంగాణలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం 53 అడుగులకు చేరగా, భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 

గోదావరి భీకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మధ్య రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు వద్ద 22 గేట్లు ఎత్తారు. 52 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

అటు, మహారాష్ట్రలో మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో గోదావరి నదికి వరద పోటెత్తడంతో పలు ఆలయాలు నీటమునిగాయి.
Go Back to Shorts
Godavari
Flood
Rains
Telangana
Maharashtra

More Telugu News