తమ పిల్లలను విజయవాడ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన శాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డి
- విజయవాడలోని కోనేరు బసవయ్య చౌదరి జడ్పీ ఉన్నత పాఠశాలలో చేర్పించిన వైనం
- పాపను ఆరో తరగతిలో, బాబును 8వ తరగతిలో చేర్పించిన ప్రభాకర్‌రెడ్డి భార్య
- స్కూల్‌లో మౌలిక వసతులు బాగున్నాయని ప్రశంస
ఆయన భార్య లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూలుకు వచ్చి వారిని చేర్పించారు. ప్రభాకర్‌రెడ్డి గతంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలోనూ పిల్లలను అక్కడి ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ.. కోనేరు బసవయ్య చౌదరి పాఠశాలలో మౌలిక వసతులు బాగున్నాయని, ఆటస్థలం కూడా ఉండడంతో పిల్లలను ఇక్కడ చేర్పించినట్టు చెప్పారు. పాపను ఆరో తరగతిలో, బాబును ఎనిమిదో తరగతిలో చేర్పించినట్టు చెప్పారు.