Lavanya Tripathi: 'హ్యాపీ బర్త్ డే' మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్!

  • లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రదారిణిగా 'హ్యాపీ బర్త్ డే'
  • కామెడీ డ్రామా జోనర్లో సాగే కథ 
  • సంగీత దర్శకుడిగా కాలభైరవ 
  • జులై 8వ తేదీన సినిమా విడుదల
Happy Birthday movie trailer released

ఒకానొక సమయంలో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన లావణ్య త్రిపాఠి, ఆ తరువాత కాస్త వెనకబడుతూనే వచ్చింది. అలాంటి లావణ్య ఓ విభిన్నమైన కథాశంతో రూపొందిన సినిమాలో చేసింది. ఆ సినిమా పేరే 'హ్యాపీ బర్త్ డే'. 'మత్తువదలరా' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రితేశ్ రాణా ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. 

ఈ సినిమాలో వెన్నెల కిశోర్ .. సత్య ..  రాహుల్ రామకృష్ణ కీలకమైన పాత్రలను పోషించారు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా పూర్తి వినోదభరితమైన కథగా రూపొందిందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. 

'ఆవేశం అగ్గిపుల్లలాంటిది ఒక్కసారే వెలిగించవచ్చు ..' వంటి డైలాగ్స్ బాగున్నాయి. నాన్ స్టాప్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను, జులై 8వ తేదీన విడుదల చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి మినహా దాదాపు కమెడియన్స్  పైనే ఈ కథ నడుస్తుందనే విషయం అర్థమవుతోంది.

More Telugu News