Kurnool District: కర్నూలు ఎస్పీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సిద్ధార్థ్ కౌశ‌ల్‌... బెస్ట్ విషెస్ చెప్పిన టాలీవుడ్ ద‌ర్శ‌కుడు

Gopichandh Malineni best wishes to siddharth kaushal
షార్ట్స్‌లో చూడండి
యువ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశ‌ల్ క‌ర్నూలు జిల్లా ఎస్పీగా బాధ్య‌త‌లు చేప‌ట్టగా... ఆయ‌న‌కు టాలీవుడ్ ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని బెస్ట్ విషెస్ చెప్పారు. తాను క‌ర్నూలు జిల్లా ఎస్పీగా బాధ్య‌త‌లు తీసుకున్నాన‌ని కౌశ‌ల్ ఓ ట్వీట్ పోస్ట్ చేయ‌గా... దానికి రీ ట్వీట్ పోస్ట్ చేసిన గోపిచంద్ మ‌లినేని... కంగ్రాచ్యులేష‌న్స్ అండ్ బెస్ట్ విషెస్ స‌ర్ అంటూ కామెంట్ పెట్టారు. 

ఇప్ప‌టికే రెండు, మూడు జిల్లాల‌కు ఎస్పీగా ప‌నిచేసిన కౌశ‌ల్‌ను సాధారణ బదిలీలలో భాగంగా ఏపీ ప్ర‌భుత్వం ఇటీవ‌లే క‌ర్నూలు జిల్లాకు బ‌దిలీ చేసింది. ఈ బ‌దిలీపై ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని స్పందించ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.
Go Back to Shorts
Kurnool District
Andhra Pradesh
Tollywood
Siddharth Kaushal
Gopichandh Malineni

More Telugu News