కేసీఆర్ ఫ్యామిలీ రూ.9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది.. దర్యాప్తు చేయాలంటూ సీబీఐకి కేఏ పాల్ ఫిర్యాదు
- ఢిల్లీలో సీబీఐ కార్యాలయానికి వెళ్లిన కేఏ పాల్
- సీబీఐ డైరెక్టర్‌తో అరగంట పాటు భేటీ
- కేసీఆర్ అవినీతిపై ఆధారాలు సమర్పించానన్న పాల్
అనంతరం కార్యాలయం బయటకు వచ్చిన కేఏ పాల్ అక్కడే మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం ఏకంగా రూ.9 లక్షల కోట్ల మేర అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన సమగ్ర ఆధారాలను సీబీఐ డైరెక్టర్‌కు అందజేశానని ఆయన తెలిపారు. తాను అందజేసిన ఆధారాలను పరిశీలిస్తామని, అవసరమనుకుంటే తనను సంప్రదిస్తామని సీబీఐ డైరెక్టర్ చెప్పినట్టు పాల్ వెల్లడించారు.