విజయ్ చిత్రానికి 'వారసుడు' టైటిల్ ఖరారు.. అధికారిక ప్రకటన!
- వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ కొత్త సినిమా
- తెలుగులో ‘వారసుడు’.. తమిళ్ లో ‘వారిసు’ టైటిల్ ఖరారు
- హీరోయిన్ గా రష్మిక మందన్న
ఈ సినిమాకు ‘వారసుడు’ అనే టైటిల్ ను తాజాగా ఖరారు చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. 1993లో ఇదే టైటిల్ తో నాగార్జున, నగ్మ హీరో, హీరోయిన్లుగా ఓ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో అది మంచి సక్సెస్ సాధించింది.
మరోవైపు ఈ చిత్రానికి తమిళంలో ‘వారిసు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. బుధవారం విజయ్ పుట్టిన రోజును పురస్కరించుకొని చిత్ర బృందం హీరో ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్‌ను వెల్లడించింది. సూట్ ధరించిన విజయ్ క్లాస్ లుక్ లో చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ద బాస్ రిటర్న్స్ అనే క్యాప్షన్ పెట్టారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు.