Muslim Lady: 16 ఏళ్ల‌కే ముస్లిం యువ‌తులు పెళ్లి చేసుకోవ‌చ్చు... పంజాబ్‌, హ‌ర్యానా కోర్టు సంచ‌ల‌న తీర్పు

punjab and haryana high court recognises 16 years olid nuslim lady marriage
  • 16 ఏళ్ల‌కే పెళ్లి చేసుకున్న ముస్లిం యువ‌తి
  • ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ హైకోర్టును ఆశ్ర‌యించిన వైనం
  • యువ‌తి వివాహాన్ని గుర్తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన కోర్టు
  • ష‌రియా చ‌ట్టం ప్ర‌కారం ముస్లిం యువ‌తికి ఆ హ‌క్కు ఉందంటూ వ్యాఖ్య‌
యువ‌తుల వివాహ వ‌య‌స్సుకు సంబంధించి పంజాబ్‌, హ‌ర్యానా హైకోర్టు సోమ‌వారం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ముస్లిం యువ‌తి 16 ఏళ్లు నిండ‌గానే త‌న‌కు ఇష్ట‌మైన వ్య‌క్తిని వివాహం చేసుకోవ‌చ్చంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. ష‌రియా  చ‌ట్టం ప్ర‌కారం 16 ఏళ్లు నిండిన ముస్లిం యువ‌తులు త‌మ‌కు ఇష్ట‌మైన యువ‌కుడిని పెళ్లి చేసుకునే హ‌క్కు ఉంది. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన హైకోర్టు... ముస్లిం యువ‌తి 16 ఏళ్లు నిండ‌గానే పెళ్లి చేసుకునేందుకు అర్హురాలేన‌ని తేల్చి చెప్పింది. 

16 ఏళ్లు నిండిన ఓ యువ‌తి త‌న‌కు ఇష్ట‌మైన వ్యక్తిని పెళ్లి చేసుకుని త‌మ‌కు ర‌క్ష‌ణ కల్పించాలంటూ పంజాబ్‌, హ‌ర్యానా కోర్టును ఆశ్ర‌యించింది. స‌ద‌రు యువ‌తి పిటిష‌న్‌పై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు ష‌రియా చ‌ట్టాన్ని ఉటంకిస్తూ వారి వివాహాన్ని గుర్తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అంతేకాకుండా ష‌రియా చ‌ట్టం ప్ర‌కారం 16 ఏళ్లు నిండిన ముస్లిం యువతికి త‌న‌కు ఇష్ట‌మైన వ్యక్తిని పెళ్లి చేసుకునే హ‌క్కు ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.
Muslim Lady
Marriage
Punjab and Haryana High Court
Sharia Law

More Telugu News