జగన్ సార్.. ఏపీ పోలీస్‌ను కాపాడండి: ప్లకార్డుతో ఏఆర్ కానిస్టేబుల్ నిరసన
- అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ నిరసన
- బకాయిలు చెల్లించాలంటూ వేడుకోలు
- బకాయిలు చెల్లించినట్టు ఆడిట్‌లో చూపించి పన్ను కూడా వసూలు చేశారని ఆరోపణ
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమకు మూడు సరెండర్ లీవ్స్, అదనపు సరెండర్ లీవ్స్‌కు సంబంధించిన మొత్తం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, 14 నెలల రవాణా భత్యం, ఆరు డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. అంతేకాదు, ఈ బకాయిలు చెల్లించినట్టు ప్రభుత్వం ఆడిట్‌లో చూపించి పన్ను కూడా వసూలు చేసిందని ఆరోపించారు.