TDP: మాజీ మంత్రి నారాయ‌ణ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై విచార‌ణ వాయిదా

  • టెన్త్ ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీలో నారాయ‌ణ అరెస్ట్‌
  • చిత్తూరు కోర్టులో హాజ‌రు ప‌ర‌చిన పోలీసులు
  • నారాయ‌ణ‌కు జ్యూడిషియ‌ల్ రిమాండే అక్క‌ర్లేద‌న్న న్యాయ‌మూర్తి
  • అప్ప‌టిక‌ప్పుడే బెయిల్ మంజూరు చేసిన వైనం
  • ఆ బెయిల్‌ను ర‌ద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పోలీసుల పిటిష‌న్‌
  • ఈ పిటిష‌న్‌పై విచార‌ణ ఈ నెల 24కు వాయిదా
chittoor court adjourns ap police petition to cancel tdp leader narayana bail

ప‌దో త‌ర‌గతి ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీ కేసులో అరెస్టయిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణకు మంజూరు చేసిన బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌న్న పిటిష‌న్‌పై విచార‌ణ‌ను చిత్తూరు కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. టెన్త్ ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీ కేసులో హైద‌రాబాద్‌లో నారాయ‌ణ‌ను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు చిత్తూరు కోర్టులో హాజ‌రుప‌ర‌చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ కేసులో నారాయ‌ణ‌కు జ్యూడిషియ‌ల్ రిమాండే అక్క‌ర్లేదని అభిప్రాయ‌ప‌డ్డ న్యాయ‌మూర్తి అప్ప‌టిక‌ప్పుడే బెయిల్ మంజూరు చేశారు. దీంతో జైలుకు వెళ్ల‌కుండానే నారాయ‌ణ బెయిల్‌పై విడుద‌ల‌య్యారు.

ఆ త‌ర్వాత నారాయ‌ణ‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏపీ పోలీసులు చిత్తూరు కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై ఇప్ప‌టికే ఓ ద‌ఫా విచార‌ణ సాగ‌గా... తాజాగా మంగ‌ళ‌వారం కూడా దీనిపై చిత్తూరు కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. విచార‌ణ సంద‌ర్భంగా పోలీసుల‌తో పాటు నారాయ‌ణ త‌ర‌ఫు వాద‌న‌ల‌ను విన్న కోర్టు త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 24కు వాయిదా వేసింది.

More Telugu News