తన తండ్రి పుట్టినరోజు వేడుకలకు దూరంగా మహేశ్ బాబు.. కారణం ఇదే!
- నిన్న 80వ పుట్టినరోజును జరుపుకున్న కృష్ణ
- జన్మదిన వేడుకకు హాజరైన కుటుంబ సభ్యులు
- ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ లో ఉన్న మహేశ్
కృష్ణ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులందరూ కలిసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. భార్య ఇందిర, వారి కుమార్తెలు, చిన్నల్లుడు సుధీర్ బాబు, తమ్ముడు ఆదిశేషగిరి రావు, కుమారుడు రమేశ్ బాబు పిల్లలు అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. మరోవైపు, మహేశ్ బాబు ఈ వేడుకలో కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అసలు విషయం ఏమిటంటే... తన ఫ్యామిలీతో కలిసి మహేశ్ బాబు ఫారిన్ టూర్ లో ఉన్నారు. అందువల్లే ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు. అయితే, ట్విట్టర్ ద్వారా తన తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో మీలాంటి గొప్ప వ్యక్తి మరొకరు ఉండరని మహేశ్ భావోద్వేగానికి గురయ్యారు.

