మన బిడ్డలు కులవృత్తులు చేసుకోవాలి... కేసీఆర్ బిడ్డలు రాజ్యాలు ఏలాలి: షర్మిల
- కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన షర్మిల
- రుణమాఫీ అని మోసం చేశాడని ఆరోపణ
- రైతుల పథకాలన్నీ నిలిపివేశాడని ఆగ్రహం
- వైఎస్సార్ పాలన మళ్లీ తెస్తామని వ్యాఖ్యలు
వైఎస్సార్ హయాంలో వ్యవసాయం అంటే పండుగ అని, రైతులకు ఏ కష్టమొచ్చినా వైఎస్సార్ ఆదుకున్నారని స్పష్టం చేశారు. కానీ, కేసీఆర్ రుణమాఫీ అని మోసం చేశాడని ఆరోపించారు. రైతులకు అందే పథకాలన్నీ బంద్ చేశాడని, ముష్టి రూ.5 వేలు ఇచ్చి రైతులను కోటీశ్వరులను చేస్తాం అంటున్నాడని మండిపడ్డారు. రైతు బీమాను 60 ఏళ్లకే పరిమితం చేసి అన్యాయం చేశాడని షర్మిల విమర్శించారు.