Major: టికెట్ కోసం క్యూలో నిల్చుని.. మేజర్ సినిమాను విభిన్నంగా ప్రమోట్ చేసిన మహేశ్‌బాబు.. వీడియో ఇదిగో!

Queues are so much fun with adavi sesh niharika shares viral video
షార్ట్స్‌లో చూడండి
తాను నిర్మించిన మేజర్ సినిమాను  ప్రముఖ నటుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు వినూత్నంగా ప్రమోట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. యూట్యూబర్, డిజిటల్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం.. సినిమా టికెట్ కోసం ఓ థియేటర్ క్యూలో నిల్చుంటుంది. అయితే, ఒకరి తర్వాత ఒకరిగా వచ్చిన కొందరు ఆమె కంటే ముందు నిల్చుంటారు. దీంతో నిహారిక ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత కాసేపటికి మేజర్ సినిమా హీరో అడవి శేష్ వచ్చి ఆమె ముందు నిల్చుంటాడు. దీంతో నిహారికకు, అతడికి మధ్య వాగ్వివాదం జరుగుతుంది.

వారి మధ్య గొడవ జరుగుతుండగానే మహేశ్‌బాబు వచ్చి నిల్చుంటాడు. అతడిని చూసిన నిహారిక ఆశ్చర్యపోతుంది. అప్పుడు మహేశ్.. మా స్నేహితులను కూడా పిలవొచ్చా? అని ప్రశ్నించగా, అందుకు ఆమె ఓకే అంటుంది. దీంతో లైన్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ సందర్భంగా మహేశ్ ఫోన్ నంబరు తీసుకోవాలని భావించి అడిగే లోపే అతడు వెళ్లిపోతాడు. అది చూసి నిహారిక అసంతృప్తికి గురవుతుంది. 

నిహారిక తన ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో దూసుకుపోతోంది. ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన జవాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమా జూన్ 3న తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Go Back to Shorts
Major
Adavi Sesh
Niharika NM
Mahesh Babu

More Telugu News