Mahesh Babu: యూఎస్ఏ లో గట్టిగానే సందడి చేస్తున్న 'సర్కారువారి పాట'

  • ఈ నెల 12వ తేదీన విడుదలైన 'సర్కారువారి పాట'
  • రెండు రోజుల్లోనే 103 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమా
  • యూఎస్ఏలో 2 మిలియన్ ప్లస్ వసూళ్లు
  • యూ ట్యూబ్ లో దుమ్మురేపేస్తున్న 'మ మ మహేశా' సాంగ్ 
Sarkaru Vaari Paata movie update

మహేశ్ బాబు - కీర్తి సురేశ్ జంటగా దర్శకుడు పరశురామ్ 'సర్కారు వారి పాట' సినిమాను రూపొందించాడు. ఈ నెల 12వ  తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండు రోజుల్లోనే 103 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 

ఇక యూఎస్ఏలో ఈ సినిమా వసూళ్లు గట్టిగానే ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇంతవరకూ ఈ సినిమా వసూళ్లు 2 మిలియన్ ప్లస్ వసూళ్లను రాబట్టినట్టుగా చెబుతున్నారు. వీకెండ్ తరువాత కూడా ఈ సినిమా ఇదే స్థాయిలో దూకుడు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. 

ఇక 'కళావతి' .. 'పెన్నీ' సాంగ్స్ మాదిరిగానే యూట్యూబ్ లో 'మ మ మహేశా' పాట దూసుకుపోతుండటం విశేషం. ఇప్పటికే ఈ పాటకి 31 మిలియన్ ప్లస్ వ్యూస్ లభించాయని అంటున్నారు. పాటల పరంగా దూసుకుపోతున్న ఈ సినిమా, ఫైట్స్ పరంగా కూడా మంచి మార్కులు కొట్టేయడం విశేషం.

More Telugu News