నారాయణ విద్యాసంస్థలను దెబ్బతీస్తే విద్యార్థులు నష్టపోతారు: ప్రత్తిపాటి పుల్లారావు

Students will suffer if you damage Narayana institutions says Prathipati Pulla Rao
  • అరెస్టును ఖండిస్తున్నామన్న పుల్లారావు 
  • పేపర్ లీక్ కాలేదని బొత్స చెప్పారని వ్యాఖ్య 
  • రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్ అంటూ విమర్శ 
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రశ్నాప్రత్రాల లీకేజీనే జరగలేదని సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారని గుర్తు చేశారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను ప్రభుత్వం అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్న నారాయణ విద్యాసంస్థల పేరును దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. అక్రమ కేసులతో ఈ విద్యాసంస్థలను దెబ్బతీస్తే... విద్యార్థులు నష్టపోతారని చెప్పారు. నారాయణను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Prathipati Pulla Rao
P Narayana
Telugudesam
Botsa Satyanarayana
YSRCP

More Telugu News