తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా కూర్చున్న బాలుడిని ఎత్తుకెళ్లిన మ‌హిళ‌

 boy kidnap case in ttd
  • బాలుడి కిడ్నాప్‌పై అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు 
  • కిడ్నాప్ చేసిన మ‌హిళ‌ ఏపీ03 జడ్‌ 0300 నంబరు ఆర్టీసీ బస్సు ఎక్కింద‌ని గుర్తింపు
  • కిడ్నాప్‌కు గురైన బాలుడి పేరు గోవ‌ర్ధ‌న్ రాయ‌ల్ అని తెలిపిన పోలీసులు
తిరుమల శ్రీవారి ఆలయం వ‌ద్ద క‌ల‌క‌లం చెల‌రేగింది. ఆల‌యం ఎదురుగా ఐదేళ్ల బాలుడు కూర్చొని ఉండ‌గా అత‌డిని ఓ మ‌హిళ ఎత్తుకెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నిన్న సాయంత్రం 5.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బాలుడి కిడ్నాప్‌పై అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. 

బాలుడిని ఎత్తుకెళ్లిన మహిళ తిరుపతికి వెళ్లే ఏపీ03 జడ్‌ 0300 నంబరు ఆర్టీసీ బస్సు ఎక్కింద‌ని పోలీసులు చెప్పారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా మహిళను గుర్తించేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన బాలుడి పేరు గోవ‌ర్ధ‌న్ రాయ‌ల్ అని, ఆ బాలుడి కుటుంబం తిరుపతి దామినీడలో నివ‌సిస్తోంద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Crime News
TTD
Tirumala

More Telugu News