'ఆచార్య'లో లేకపోయినప్పటికీ.. కాజల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా..?
- తొలి షెడ్యూల్ పూర్తయిన తర్వాత కాజల్ పాత్రను తొలగించిన 'ఆచార్య' టీమ్
- అప్పటికే కోటిన్నర రూపాయలను ఖాతాలో వేసుకున్న కాజల్
- అందుకే ఆమె సైలెంట్ గా ఉందని ఫిలింనగర్ టాక్
అయితే, సినిమా నుంచి కాజల్ తప్పుకోవడంపై ఫిలింనగర్ లో మరో వార్త ప్రచారమవుతోంది. ఈ చిత్రం నుంచి ఆమె తొలి షెడ్యూల్ తర్వాత తప్పుకున్నప్పటికీ... అప్పటికే తన రెమ్యునరేషన్ ను తీసేసుకుందట. దాదాపు కోటిన్నర రూపాయలను ఆమె తీసుకుందని చెపుతున్నారు. తనకు రావాల్సిన డబ్బు వచ్చినందున... సినిమా నుంచి పక్కన పెట్టినా ఆమె సైలెంట్ గా ఉందని అంటున్నారు. మరోవైపు ఇటీవలే కాజల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.