మా అత్తమ్మ కోసమే ఈ సినిమా: ఉపాసన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా అత్తమ్మ కోసమే ఈ సినిమా: ఉపాసన

Upasana Konidela opines on Acharya
  • చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య
  • నిన్న హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • సోషల్ మీడియాలో స్పందించిన ఉపాసన
  • ఆచార్య విడుదలకు సర్వం సిద్ధమైందని వెల్లడి
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా కోడలు ఉపాసన కొణిదెల కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కు చిరంజీవి అర్ధాంగి సురేఖ రాగా, అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న ఉపాసన తన అత్తగారికి ఎదురెళ్లి గౌరవ భావంతో స్వాగతం పలికారు. 

కాగా, ఆచార్య చిత్రంపై ఉపాసన సోషల్ మీడియాలో స్పందించారు. మా అత్తమ్మ కోసమే ఈ సినిమా అని వెల్లడించారు. ఆచార్య విడుదలకు సర్వం సిద్ధమైందని, ఈ నెల 29న థియేటర్లలోకి వస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపాసన... రామ్ చరణ్ తో కలిసి ఉన్న ఫొటోను కూడా పంచుకున్నారు. 

నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ... తాను, రామ్ చరణ్ కలిసి నటిస్తే చూడాలన్నది సురేఖ కల అని చెప్పారు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లో నటిస్తుండడంతో, రాజమౌళిని ఒప్పించి రామ్ చరణ్ ను ఆచార్య సెట్స్ మీదికి తీసుకొచ్చేందుకు సురేఖ సెంటిమెంట్ ను ప్రయోగించామని కూడా వెల్లడించారు.
Upasana
Surekha
Acharya
Chiranjeevi
Ramcharan

More Telugu News