చంద్రబాబు వదిలిన విల్లు పవన్: ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా
- పవన్ హరిహర వీర మల్లు కాదు
- వైసీపీ పాలనలో ప్రజలు బాగానే ఉన్నారు
- పవన్, చంద్రబాబులకే కష్టాలున్నాయన్న దాడిశెట్టి
ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా స్పందిస్తూ... 'వైసీపీ పాలనలో ప్రజలు బాగానే ఉన్నారు. పవన్, చంద్రబాబుకు మాత్రమే కష్టాలున్నాయి. చంద్రబాబు కన్నీరు తుడిచేందుకు పవన్ వస్తున్నారు. తన పర్యటనలో జై జగన్ అనే నినాదాలు పవన్‌కు వినిపించలేదా? పవన్ హరిహర వీరమల్లు కాదు.. చంద్రబాబు వదిలిన విల్లు' అని ఆయన సెటైర్లు సంధించారు.