Gujarat Titans: చెన్నై సూపర్ కింగ్స్ ను కట్టడి చేసిన గుజరాత్ టైటాన్స్ బౌలర్లు

  • పూణేలో మ్యాచ్
  • టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 169 రన్స్ చేసిన చెన్నై
  • రుతురాజ్ గైక్వాడ్ అర్ధసెంచరీ
  • రాణించిన రాయుడు
Gujarat Titans restricts Chennai Super Kings

ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ దూకుడు చూస్తే భారీ స్కోరు సాధించేలా కనిపించిన చెన్నై సూపర్ కింగ్స్ ను గుజరాత్ బౌలర్లు మిడిల్ ఓవర్లలో కట్టడి చేశారు. దాంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 169 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 73 పరుగులు చేశాడు. అంబటి రాయుడు 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 46 పరుగులు సాధించాడు. కెప్టెన్ రవీంద్ర జడేజా 12 బంతుల్లో 2 సిక్సర్లతో 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2, మహ్మద్ షమీ 1, యశ్ దయాళ్ 1 వికెట్ తీశారు. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా తప్పుకోవడంతో తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్టూ తీయలేకపోయాడు.

More Telugu News