SRH: టాస్ గెలిచిన సన్ రైజర్స్... కోల్ కతా జట్టుతో కీలక పోరు

Sunrisers won the toss again
షార్ట్స్‌లో చూడండి
కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ తో నేడు కీలక సమరంలో తలపడనుంది. ఈసారి ఐపీఎల్ లో 10 జట్లు ఆడుతుండగా, టాప్-4 స్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. దాంతో ప్రతిమ్యాచ్ కచ్చితంగా నెగ్గాల్సిన స్థితిలో సన్ రైజర్స్ నేటి మ్యాచ్ బరిలో దిగనుంది. సన్ రైజర్స్ ను మరోసారి టాస్ వరించింది. టాస్ గెలిచిన విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 

ఇక జట్టు కూర్పు విషయానికొస్తే... ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడడంలేదు. అతడి స్థానంలో జగదీశ సుచిత్ కు అవకాశం ఇచ్చారు. ఇక కోల్ కతా జట్టులోకి ఆరోన్ ఫించ్ ఆగమనంతో బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతంగా కనిపిస్తోంది. అమన్ హకీమ్ ఖాన్, షెల్డన్ జాక్సన్ కూడా జట్టులోకి వచ్చారు.
Go Back to Shorts
SRH
KKR
Toss
IPL

More Telugu News