పెళ్లితో ఒక్కటైన రణబీర్, అలియా... ముంబయిలో ఘనంగా వివాహ వేడుక
- గత కొన్నేళ్లుగా ప్రేమలో రణబీర్, అలియా
- రణబీర్ నివాసంలో నేడు వివాహం
- బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి
ముంబయిలోని రణబీర్ కపూర్ నివాసం 'వాస్తు'లో ఈ వివాహ వేడుక నిర్వహించారు. ఈ సెలబ్రిటీ మ్యారేజికి కపూర్ కుటుంబీకులు, అతికొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నీతూ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ తదితరులు పెళ్లింట సందడి చేశారు. కాగా, అలియా తండ్రి, ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ తన అల్లుడు రణబీర్ కపూర్ పేరును అరచేతిపై హెన్నాతో రాసుకోవడం విశేషం.