ipl: మైండ్ బ్లోయింగ్ క్యాచ్ ప‌ట్టిన స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాడు రాహుల్ త్రిపాఠి.. వీడియో ఇదిగో

  • ఐపీఎల్ లో గ‌త రాత్రి గుజరాత్-హైద‌రాబాద్ మ‌ధ్య మ్యాచ్
  • భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో బ్యాట్స్‌మ‌న్ శుభ‌మ‌న్ ఆఫ్ సైడ్‌లో భారీ షాట్‌
  • గాల్లోకి ఎగిరి త‌న ఎడ‌మ వైపున‌కు దూకి క్యాచ్ ప‌ట్టిన రాహుల్
rahul tripati catch video goes viral

ఐపీఎల్ లో గ‌త రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపొందిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాడు రాహుల్ త్రిపాఠి అద్భుత రీతిలో క్యాచ్ ప‌ట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. గుజ‌రాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేస్తోన్న స‌మ‌యంలో భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో బ్యాట్స్‌మ‌న్ శుభ‌మ‌న్ గిల్‌ ఆఫ్ సైడ్‌లో భారీ షాట్‌కు య‌త్నించాడు. 
                                          
దీంతో బంతి వేగంగా గాల్లో క‌వ‌ర్స్ మీదుగా బౌండ‌రీ దిశ‌గా వెళ్ల‌సాగింది. ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ త్రిపాఠి గాల్లోకి ఎగిరి త‌న ఎడ‌మ వైపున‌కు దూకాడు. ఎడ‌మ చేతితో క్యాచ్ ప‌ట్టి గిల్ ను ఔట్ చేశాడు. రాహుల్ త్రిపాఠి క్యాచ్ ప‌ట్టిన తీరుపై క్రికెట్ అభిమానులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. మైండ్ బ్లోయింగ్ క్యాచ్ ప‌ట్టాడంటూ వీడియోను షేర్ చేస్తున్నారు.

More Telugu News