Sunrisers: క్యాచ్ లు వదిలినా... గుజరాత్ టైటాన్స్ ను కట్టడి చేసిన సన్ రైజర్స్ బౌలర్లు

Sunrisers bowlers restricts Gujarat titans despite bad fielding
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ తాజా సీజన్ లో కొత్త జట్టుగా అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్... సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో పోరులో భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచ్ ల్లో గెలిచిన గుజరాత్ టైటాన్స్ ను సన్ రైజర్స్ బౌలర్లు అద్భుతంగా నియంత్రించారు. ఫీల్డర్లు వరుసగా క్యాచ్ లు వదిలినప్పటికీ బౌలర్లు సరైన ప్రదేశాల్లో బంతులు సంధిస్తూ, గుజరాత్ బ్యాటర్లకు కళ్లెం వేశారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. 

గుజరాత్ జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 42 బంతుల్లో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అభినవ్ మనోహర్ 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2, నటరాజన్ 2, మార్కో జాన్సెన్ 1, ఉమ్రాన్ మాలిక్ 1 వికెట్ తీశారు.
Go Back to Shorts
Sunrisers
Gujarat Titans
IPL

More Telugu News