ఓడినా అందరి మద్దతు రవీంద్ర జడేజాకే: సీఎస్కే బ్యాటింగ్ కోచ్

Ravindra Jadeja being backed by everyone in CSK
  • జడేజాను అందరూ గౌరవిస్తున్నారు
  • ధోనీ ఇంకా జట్టుతోనే ఉన్నాడు
  • కెప్టెన్సీపై వారిద్దరి మధ్య చర్చ
  • వెల్లడించిన మైఖేల్ హస్సే
ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా నాలుగు ఓటములు ఎదుర్కొన్నప్పటికీ.. కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజాకు సభ్యులు అందరూ మద్దతుగా నిలుస్తున్నారని బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సే తెలిపారు. తాము కనీసం కొన్ని విజయాల కోసం చూస్తున్నామని.. అప్పుడు జడేజాపై కెప్టెన్సీ ఒత్తిడి తగ్గి, మరింత రిలాక్స్ అవుతాడని హస్సే చెప్పారు. 

‘‘జడేజాను కెప్టెన్ చేయడం అన్నది పెద్ద మార్పే. ఎంఎస్ ధోనీ ఎంతో కాలంగా కెప్టెన్ గా పనిచేయడమే కాకుండా, చక్కగా రాణించాడు. గొప్ప విషయం ఏమిటంటే జడేజాకు సాయం చేసేందుకు ధోనీ ఇప్పటికీ జట్టుతోనే ఉన్నాడు. నాకు తెలిసి జడేజా, ధోనీ కెప్టెన్సీ గురించి రోజూ మాట్లాడుకుంటారు. నాయకత్వ మార్పు సాఫీగా జరిగే విషయమై వారు చర్చించుకుంటారు. జడేజాను ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారు. కొన్ని విజయాలతో అతడిపై ఒత్తిడి తగ్గిపోతుంది. త్వరలోనే విజయాలు నమోదు చేస్తామనే ఆశతో ఉన్నాం’’ అని హస్సే వివరించారు. మంగళవారం ఆర్సీబీతో సీఎస్కే తలపడనుంది. ఇది ఈ సీజన్ లో సీఎస్కేకు ఐదో మ్యాచ్ అవుతుంది.
Go Back to Shorts
Ravindra Jadeja
CSK
Michael Hussey
IPL

More Telugu News