హెట్మెయర్ సిక్సర్ల జోరు... గౌరవప్రద స్కోరు సాధించిన రాజస్థాన్ రాయల్స్
- రాజస్థాన్ వర్సెస్ లక్నో
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 రన్స్
- 6 సిక్సులు బాదిన హెట్మెయర్
అశ్విన్ 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అయితే, హెట్మెయర్ మాత్రం బంతికి చుక్కలు చూపించాడు. ఓవరాల్ గా హెట్మెయర్ 36 బంతులాడి 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 1 ఫోర్, 6 భారీ సిక్సులు ఉన్నాయి.