మోదీతో జ‌గ‌న్ భేటీ ప్రారంభం.. 6 గంట‌ల‌కు కేంద్ర మంత్రి నిర్మ‌ల‌తో భేటీ
Add ap7am to your home Screen

మోదీతో జ‌గ‌న్ భేటీ ప్రారంభం.. 6 గంట‌ల‌కు కేంద్ర మంత్రి నిర్మ‌ల‌తో భేటీ

ap cm ys jagan will meet nirmala sitharaman
  • మోదీతో భేటీలో ప‌లు కీల‌క అంశాల ప్ర‌స్తావ‌న‌
  • మోదీతో భేటీ త‌ర్వాత నిర్మ‌ల‌తో జ‌గ‌న్ భేటీ
  • ఆ త‌ర్వాత అమిత్ షాతో భేటీ కానున్న జ‌గ‌న్‌
దేశ రాజ‌ధాని ఢిల్లీలో అడుగు పెట్టిన మ‌రుక్ష‌ణ‌మే ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బిజీబిజీగా మారిపోయారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేరిన జ‌గ‌న్..ఢిల్లీ చేరుకున్న వెంట‌నే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో భేటీకి సిద్ధ‌మైపోయారు. సాయంత్రం 4.30 గంట‌ల‌కు మోదీతో జ‌గ‌న్ భేటీ ప్రారంభ‌మైంది. ఈ భేటీలో ఏపీకి సంబంధించిన ప‌లు కీల‌క అంశాల‌పై మోదీతో జ‌గ‌న్ చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం.

మోదీతో భేటీ ముగిసిన త‌ర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో జ‌గ‌న్ భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంట‌ల‌కు మొద‌లుకానున్న ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి, రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న అప్పులు, భ‌విష్య‌త్తులో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ల‌పై నిర్మ‌ల‌తో జ‌గ‌న్ చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ భేటీ ముగిసిన త‌ర్వాత రాత్రి 9.30 గంట‌ల‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.
YS Jagan
YSRCP
Prime Minister
Narendra Modi
Nirmala Sitharaman

More Telugu News