చిరూ .. చరణ్ చేసే పోరాటం ఒక రేంజ్ లో ఉంటుందట!
- కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య'
- ప్రధాన పాత్రల్లో చిరూ - చరణ్
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
- ఏప్రిల్ 29వ తేదీన విడుదల
ఈ సినిమాలో ముందుగా చరణ్ తో చిన్న పాత్ర చేయిద్దామని అనుకున్నారు. కానీ ఆయన పాత్ర డిమాండ్ చేయడం వలన పెంచుతూ వెళ్లారు. అలా ఒక రకంగా ఈ సినిమా మల్టీ స్టారర్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో చిరూ - చరణ్ కలిసి తెరపై ఎంతసేపు కనిపిస్తారనేది ఆసక్తికరమైన అంశంగా మారింది.
ఈ సినిమాలో చిరూ .. చరణ్ సెపరేటు సీన్స్ ఎలాగూ ఉంటాయి. ఇక ఇద్దరూ కలిసి తెరపై 20 నుంచి 25 నిమిషాల వరకూ కనిపిస్తారట. ఈ ఇద్దరూ కలిసి చేసే పోరాటం ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు. సినిమా మొత్తం ఒక ఎత్తనీ .. ఈ ఒక్క సీన్ ఒక ఎత్తని చెబుతున్నారు. ఇప్పుడు ఈ విషయం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.