ఏపీలో మరింత కనిష్ఠ స్థాయికి కరోనా వ్యాప్తి... కొత్త కేసులు ఎన్నంటే...!
- గత 24 గంటల్లో 5,508 కరోనా పరీక్షలు
- 26 మందికి పాజిటివ్
- అనంతపురం జిల్లాలో 8 కొత్త కేసులు
- పలు జిల్లాల్లో కొత్త కేసులు నిల్
- ఇంకా 547 మందికి చికిత్స
అదే సమయంలో 85 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజులో కరోనా మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,18, 884 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,03,607 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 547 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా వల్ల 14,730 మంది మరణించారు.
.