ఇక అందరికీ 'నీట్'... గరిష్ఠ వయో పరిమితి నిబంధన ఎత్తివేసిన కేంద్రం
- గతంలో 25 ఏళ్లు దాటితే నీట్ కు అనర్హత
- అన్ని వయసుల వారికి నీట్ రాసే వెసులుబాటు
- ఈసారి నీట్ పరీక్షకు భారీగా హాజరయ్యే అవకాశం
- విస్తృతస్థాయిలో అందుబాటులోకి వైద్య విద్య
కాగా, వయో పరిమితి నిబంధన తొలగించిన కారణంగా ఈ ఏడాది నీట్ కు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే అవకాశాలున్నాయి. అదే సమయంలో వైద్య కళాశాలల్లోనూ సీట్లకు విపరీతమైన పోటీ ఏర్పడొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష నీట్ ఈ ఏడాది జూన్ లో జరిగే అవకాశం ఉంది. ఈ వారంలో నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు.