మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం.. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాకే తదుపరి అడుగు: మల్లాది విష్ణు
- విజయవాడలో రేపు మహిళా సదస్సు
- హాజరు కానున్న మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు తదితరులు
- ఏపీ రాజధాని విషయంలో త్వరలోనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్న విష్ణు
ఈ సదస్సులో మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమరావతే ఏపీ రాజధాని అన్న హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల అంశానికే కట్టుబడి ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. పనిలో పనిగా టీడీపీ అధినేత చంద్రబాబుపైనా ఆయన విరుచుకుపడ్డారు. నాడు అసెంబ్లీకి రానని ప్రతినబూనిన చంద్రబాబు ఇప్పుడు తమ సభ్యులను ఎందుకు పంపిస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.