శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
- తిరుపతికి సీజేఐ ఎన్వీ రమణ దంపతులు
- స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అర్చకులు
- శ్రీవారిని దర్శించుకున్న పలువురు నేతలు, సినీనటులు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. మరోవైపు, సినీ నటులు జాన్వీ కపూర్, మహేశ్వరి కూడా వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ కూడా స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.